వరుణ్ మణియన్ తో తన పెళ్ళి బ్రేకప్ అయిన ఆనందంలో త్రిష మంచి జోష్ లో ఉండటమే కాకుండా తన అభిమానులకు 100 రోజుల హ్యాపీ డేస్ కాంటెస్ట్ ను ఆన్ లైన్ లో పెడుతూ ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ‘మీలో ఎవరైనా నాలా వరుసగా 100 రోజులు ఆనందంగా ఉన్నారా అంటూ కొన్ని వెరైటీ కాంటెస్ట్ లు తన అభిమానులకు పెడుతూ పెద్ద పెద్ద ప్రైజ్ లు కూడా ఇస్తోంది.
‘100 హ్యాపీ డేస్. ఆర్గ్’ అనే సామాజిక సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈమధ్య కాలంలో తన పెళ్ళి బ్రేకప్ కావడంతో త్రిష దిగాలు పడింది అని వస్తున్న వార్తలకు సమాధానంగా తాను ఎంత సంతోషంగా ఉన్నానో జనానికి తెలిసే విధంగా త్రిష ఈ పోటీలను చాల ఉత్సాహ భరితంగా నిర్వహిస్తోంది.
ఈవార్తలు ఇలా ఉండగా ఈరోజు విడుదలైన ‘లయన్’ ప్రమోషన్ కార్యక్రమాలకు రావడానికి బాలయ్య ఎన్ని సార్లు అడిగినా త్రిష ఆ శక్తి కనపరచడం లేదు అని టాక్. దీనికి కారణం టాలీవుడ్ మీడియా తన పెళ్ళి బ్రేకప్ గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగితే తనకు సమాధానాలు చెప్పడం అసౌకర్యంగా ఉంటుందని త్రిష బాలయ్యకు వివరణ ఇచ్చినట్లు టాక్.
దీనితో ఇలా జనానికి కనపడకుండా కేవలం ఆన్ లైన్ లో తన అభిమానులకు ప్రశ్నలు వేస్తూ ఇలా 100 రోజుల హ్యాపీ డేస్ త్రిష సెలిబ్రేట్ చేసుకుంటోంది. అంతేకాదు ఈమధ్యనే తాను మేకప్ లేకుండా కూడ ఎంత బాగుంటానో అని చెపుతూ త్రిష పోస్ట్ చేసిన ఫోటోలు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి