అదేంటంటే మార్చి 29న ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీకి మరింత హైప్ పెంచడానికి ట్రైలర్ ను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని యోచిస్తోందట చిత్ర బృందం. మార్చి 29న ముందుగా థియేటర్లలో ట్రైలర్ ని విడుదల చేసి, అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సినీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఏప్రిల్ 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 1 లేదా 2వ తేదీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.
అంతేకాదు రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ అది ఏంటో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగక తప్పదు మరి. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కగా.. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు - శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. మహిళలకు ప్రాధాన్యం పెంచి వారి గౌరవ మర్యాదలకు మరింత విలువ పెంచేందుకు ఈ సినిమా త్వరలో మన ముందుకు రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి