అయితే ఇటీవల మాత్రం కొన్నాళ్లుగా మాత్రం రాజ్ తరుణ్ చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీసు దగ్గర ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోవడం లేదు. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒరేయ్ బుజ్జిగా పర్వాలేదనిపించగా, ఇటీవల వచ్చిన పవర్ ప్లే సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తదుపరి చేయబోయే సినిమాలపై మరింత దృష్టి పెట్టారు రాజ్ తరుణ్. ఇక ప్రస్తుతం సాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా స్టాండ్ అప్ రాహుల్. వైవిధ్యమైన కథాకథనాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుధా ముద్ద సమర్పిస్తుండగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ సంస్థలపై నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు. మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ చెక్, రాజ్ తరుణ్ కూర్చుంది చాలు ఇంక లేచి నిలబడు అంటూ సమంత రిలీజ్ చేసిన స్టాండ్ అప్ రాహుల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ సహా యూనిట్ మొత్తం మంచి విజయం లభించాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసారు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధించి రాజ్ తరుణ్ కెరీర్ కి హెల్ప్ చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి