టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఎవరూ ట్రై చేయని బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సరికొత్త దర్శకుడు బుచ్చిబాబు సనా.. సుకుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కాలం పనిచేశారు. నిజానికి ఉప్పెన సినిమా స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా మలిచేందుకు బుచ్చిబాబు సనా కి సుకుమార్ చాలా సలహాలు ఇచ్చారు. డైరెక్షన్ లో కూడా బుచ్చిబాబుకు పలు సలహాలు ఇచ్చారు. ఆ సినిమాని ప్రచారం చేయడం లో కూడా సుకుమార్ కీలక పాత్ర పోషించారు. అందుకే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఉప్పెన సినిమా లాభాల్లో కొంత షేర్ సుకుమార్ కి బహుమతిగా ఇచ్చింది.


ఇదిలా ఉండగా.. ప్రస్తుత సమాచారం ప్రకారం బుచ్చిబాబు సనా ఎన్టీఆర్ 31 వ సినిమాకి దర్శకుడిగా వహించబోతున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 60 ఏళ్ల క్రీడాకారుడుగా కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా బుచ్చిబాబు కి సలహాలు ఇవ్వాలని సుకుమార్ ని మైత్రి మూవీ మేకర్స్ కోరిందట. అందుకు సుకుమార్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే  దీన్నిబట్టి ఎన్టీఆర్ 31వ సినిమాతో సుకుమార్ అతి తక్కువ కష్టంతోనే కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారని తెలుస్తోంది.



ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్టార్ హోదా పొందుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారబోతున్నారు. రంగస్థలం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన మరో ఊర మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నారు. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి రికార్డ్స్ నెలకొల్పుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: