ఆర్తి అగర్వాల్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని వ్యక్తి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట విక్టరీ వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన "నువ్వు నాకు నచ్చావ్ " అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో అద్భుతంగా నటించి , ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది . అంతే కాకుండా ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్లు రావడంతో, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..


ఒకవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే , మరొకవైపు యంగ్ హీరోల సినిమాలలో కూడా హీరోయిన్ గా  నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మంచి విజయాలను అందుకున్న ఆర్తిఅగర్వాల్ ,తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ ఆఫర్లు రావడం పూర్తిగా ఆగిపోయాయి. ఒకదశలో ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.. అయితే నిర్మాతలలో ఒకరైన చంటి అడ్డాల ఆర్తి అగర్వాల్ ఫేడ్ అవుట్ అవడానికి ఆమె తల్లిదండ్రులే కారణం అని చెప్పాడు..


ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన అల్లరి రాముడు , అడవి రాముడు సినిమా లను చంటి అడ్డాల నిర్మించాడు . ఆర్తి అగర్వాల్ వాళ్ల తల్లిదండ్రుల పై పూర్తిగా డిపెండ్ అయ్యారు అని , తల్లిదండ్రులు ఏం చెబితే ఆ పని మాత్రమే చేసేదని చంటి అడ్డాల ఒకసారి చెప్పుకొచ్చాడు.. ఇక అంతే కాకుండా షూటింగ్ సమయంలో ఎప్పుడైనా తన పేరెంట్స్ వచ్చారు అంటే చాలు ఆర్తిఅగర్వాల్ కన్వీనియంట్ గా పని చేసే వారు కాదని ఆమె తండ్రి వల్లే ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు..

ఒక సినిమా సన్నివేశం షూటింగ్ సమయంలో జ్వరంతో బాధపడుతున్న ఆర్తి అగర్వాల్ , జ్వరం వస్తున్నప్పటికీ ఆమె షూటింగ్ లో పాల్గొన్నారని , ఒకవేళ ఆమె తండ్రి కనుక షూటింగ్ కు వచ్చి ఉంటే మాత్రం , షూటింగ్ కు  అడ్డుపడే వారిని వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: