సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు , ముఖ్యంగా దర్శకులు ఒక కథను రాసుకునేటప్పుడు , ఫలానా వ్యక్తిని హీరోగా, ఫలానా ఆమెను  హీరోయిన్ గా అనుకుంటూ సినిమా కథలు రాయడం మొదలు పెడతారు . ఇక అనుకున్నట్టుగానే ఆ హీరో , హీరోయిన్ల దగ్గరికి వెళ్లి వారి కథలు వినిపిస్తారు. ఒకవేళ వాళ్లకు ఈ కథ నచ్చితే ఓకే చెప్తారు.. లేకపోతే నో అని చెప్పేస్తారు.. సరిగ్గా ఇదే జరిగింది మహాసముద్రం సినిమా  కథ కూడా.. ఈ సినిమా కోసం ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు అలాగే ఐటమ్ సాంగ్ లో  హీరోయిన్ కోసం , స్పెషల్ హీరోయిన్లను కూడా మారుస్తూనే వస్తున్నారు.. అయితే ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


మన హీరోయిన్ లలో చాలామంది ఒక ఐటమ్ సాంగ్  కి ఓకే చెప్పడానికి ఎప్పుడు ఓకే అంటారో , ఎప్పుడు నో చెప్తారో అసలు తెలియడంలేదు.  కొత్త హీరో సినిమా పక్కన స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయడానికి ఒకసారి ఈజీగా ఓకే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలలో ఐటెం సాంగ్స్ చేయడానికి నో చెప్పేస్తుంటారు.. అయితే వీరికి ఏమవుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి సినీ ఇండస్ట్రీలో. ఎందుకంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు శర్వానంద్ కూడా . మహాసముద్రం సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంది. అందులో స్టెప్పులు వేయడానికి హీరోయిన్ కోసం దర్శకుడు చాలా రోజులనుంచి  హీరోయిన్ ల వేటలో ఉన్నాడు..

ఇక దర్శకుడు అజయ్ భూపతి ఐటెం సాంగ్ కోసం ఇప్పటి వరకు ముగ్గురు స్టార్ హీరోల ను సంప్రదించాడట.  అందులో ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ , కాజల్ అగర్వాల్ , శృతిహాసన్ వంటి స్టార్ హీరోయిన్స్ వుండడం గమనార్హం . అయితే కారణాలు తెలియదు కానీ ఈ ముగ్గురు ఐటమ్ సాంగ్ లో చేయడానికి నో చెప్పారట. ఇక దీంతో మరొకసారి హీరోయిన్ల వేట మొదలుపెట్టాడు అజయ్ భూపతి..


ఇప్పటివరకు హీరోయిన్ల కోసం వెతుకులాటలో అలసిపోయిన అజయ్ భూపతి, ఇక మరోవైపు హీరో విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం గమనార్హం . చాలామంది స్టార్ హీరోలకు కథ చెప్తే వాళ్ళు వద్దనుకున్నారు . ఆ తరువాత ఈ సినిమా కథ శర్వానంద్ దగ్గరకు వచ్చింది . అయితే ఆయన ఓకే అనడంతో సినిమా మొదలుపెట్టాడు అజయ్ భూపతి . ఇక రెండో హీరో గురించి కూడా ఇదే జరిగింది . ఆఖరికి సిద్ధార్థ ఈ లిస్ట్ లో చేరిపోయాడు.  ఇప్పుడు ఐటమ్ సాంగ్ హీరోయిన్ కోసం వెతుకులాట కూడా ఇలా తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.. హీరోయిన్ల వేట లో బాగా అలసిపోయిన అజయ్ భూపతి కి ఇప్పటికైనా మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: