కరోనా పరిస్థితులు మొదలయ్యాక గత 14 నెలలుగా ఒక దర్శకుడుకి ఒక సినిమాను పూర్తి చేయడం కూడ చాల కష్టం అయిపోతోంది. అయితే ఈ కరోనా పరిస్థితులలో త్రివిక్రమ్ కలం పెడుతున్న పరుగులను చూసి అగ్ర దర్శకులు కూడ ఆశ్చర్యపోతున్నారు.


అగ్ర దర్శకులు అంతా టాప్ హీరోలు మళ్ళీ ఎప్పుడు షూటింగ్ లకు వస్తారు అని ఎదురు చూస్తుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అనేకమంది టాప్ హీరోలకు సరిపడే కథలను తయారు చేస్తూ చాల బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ మూవీ స్క్రిప్ట్ ను అందించాడు. జూనియర్ ఎన్టీఆర్ తో తాను తీయాలని భావించిన ఒక పొలిటికల్ సెటైర్ మూవీ కథను తయారుచేసాడు.


అయితే ఆ మూవీ ప్రాజెక్ట్ ఇప్పుడు క్యాన్సిల్ కావడంతో త్రివిక్రమ్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఇప్పుడు ఒకేసారి అనేకమంది హీరోలకు కథలు వ్రాయడం మొదలుపెట్టాడు. మహేష్ కోసం ఒక కుటుంబం ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేసి ఆ మూవీ ప్రాజెక్ట్ కు రెడీ పెట్టి ఆమూవీ షూటింగ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మూవీ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాకుండానే వెంకటేష్ నటించే 75వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు.


ఇది చాలదు అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ కోసం తాను వ్రాసిన ‘పోయిరావలె హస్తిన’ కథకు మార్పులు చేసి ఆ కథను ఒక మీడియం రేంజ్ హీరోతో మూవీగా తీయాలని ప్రయత్నిస్తూ ఈ విషయమై నానీతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇలా ఒకేసారి అనేక కథలకు సంబంధించిన స్క్ర్పిట్ లు తయారు చేస్తూ ఈ లాక్ డౌన్ సమయంలో కూడ చాల బిజీగా ఉన్న త్రివిక్రమ్ చేస్తున్న అష్టావధానం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒక దర్శకుడు రచయిత కూడ అయితే ఎదో ఒక మార్గంలో బిజీగా మారిపోవచ్చు అన్న విషయానికి ఉదాహరణగా మారిన త్రివిక్రమ్..



మరింత సమాచారం తెలుసుకోండి: