అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కొంతకాలంగా ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారనే ప్రచారం టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో వీరిద్దరూ వ్యవహరించే తీరు, ఒకరికొకరు పెట్టుకునే మెసేజ్ లు, రిప్లైలు.. అబ్బో చాలా విషయమే ఉంది అనుకునేలా ఉంటాయి. కానీ అసలు వీరిద్దరి మధ్య ఏముంది అనేది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. తాజాగా అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సినిమా టైటిల్.. శిరీశ్, అను లవ్ స్టోరీపై చిన్న క్లారిటీ ఇచ్చినట్టుంది.

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త సినిమాకి 'ప్రేమ కాదంట' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన రెండు రొమాంటిక్ స్టిల్స్ రిలీజ్ చేశారు. అయితే టైటిల్ లో మాత్రం వారిద్దరిదీ ప్రేమ కాదంట అని చిన్న హింట్ ఇచ్చి వదిలారు. ప్రేమకాకపోతే మరింకేంటి అనే అర్థం వచ్చేలా సస్పెన్స్ మెయింటెన్ చేశారు.


 

అల్లు శిరీష్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అన్న అర్జున్ కెరీర్ దూసుకెళ్తున్నా.. తమ్ముడు శిరీష్ కి ఇంకా సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలో శిరీష్ టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో ప్రేమలో పడ్డారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే అప్పటికే వారిద్దరూ కలసి సినిమా చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది కాబట్టి, వారి క్లోజ్ నెస్ అంతా సినిమా ప్రమోషన్లో భాగమేనని కొంతమంది కొట్టిపారేశారు. చివరకు సినిమా టైటిల్ ని కూడా లవ్ స్టోరీకి హింట్ లా వాడుకున్నారు శిరీష్. ఈ సినిమా లివ్ ఇన్ రిలేషన్ పై నడుస్తుందట. ఇప్పటికే ఈ జానర్ లో టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చినా.. మరోసారి అదే ఫార్ములా పట్టుకున్నారు శిరీష్. అనుతో కలసి హిట్ పెయిర్ అనిపించుకోవాలనుకుంటున్నారు. 'ప్రేమ కాదంట' సినిమాకు రాకేష్ శశి దర్శకుడు కాగా, ఎమ్.విజయ్ నిర్మాత. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంయుక్తంగా స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. థియేటర్లలోనే ఈ మూవీని విడుదల చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: