బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు టీజర్స్ అందరి నుండి మంచి రెస్సాన్స్ దక్కించుకున్నాయి. కాగా ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ తో ఒకటి అలానే మాస్ రాజా రవితేజ తో మరొకటి సినిమాలను బోయపాటి చేయనున్నారు అంటూ కొద్దిరోజులుగా ఒక వార్త టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతోంది. నిజానికి ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల కోసం రెండు పవర్ఫుల్ స్టోరీస్ సిద్ధం చేసుకున్న బోయపాటి, ఇటీవల అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ స్టోరీ ని అరవింద్ కి వినిపించి ఆమోదం అందుకున్నారని, అలానే మరోవైపు రవితేజ ని కూడా కలిసి ఒక మాస్ యాక్షన్ స్టోరీ వినిపంచిన బోయపాటి ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ మూవీని ముందు మొదలెడదాం అని భావించినప్పటికీ ప్రస్తుతం ఆయనకు వరుసగా కమిట్మెంట్స్ ఉండడంతో ఈలోపు రవితేజ మూవీ పూర్తి చేసి ఆపై అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట బోయపాటి. కాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటనలు రానున్నట్లు సమాచారం ..... !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి