సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ లుగా చెలామణి అవుతున్న వారిలో అక్కినేని సమంత కూడా ఒకరు. అయితే సమంతా పై ట్రోలింగ్ కొత్తేమీ కాదు. అలా కౌంటర్ ఇచ్చిన వారిపై తిరిగి కౌంటర్ ఇచ్చి, అందరినీ షాక్ కి గురిచేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల తన వస్త్రధారణ మీద కొంత మంది నుంచి నెగిటివ్ కామెంట్లు రావడంతో , అందుకు సమంత ఇచ్చిన రిప్లై ఎంత వివాదానికి దారితీసిందో అందరికీ తెలిసిందే.

మహేష్ బాబు  నటించిన వన్ సినిమా పోస్టర్ పై  సమంత చేసిన కామెంట్స్ కు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే సమంతాకు ట్రోలింగ్ కాంట్రవర్సీలు కొత్తేమి కాదు. సిద్ధార్థ్ ప్రేమ విషయంలో కూడా ఎదురైన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య సమంతా చుట్టూ కాంట్రవర్సీ తిరుగుతోంది. తమిళ ఇండస్ట్రీ కి చెందిన నటి అయినప్పటికీ తమిళులకు వ్యతిరేకంగా కనిపించే పాత్రలు నటించడంతో అక్కడివారు భగ్గుమంటున్నారు.

అయితే తను రీసెంట్ గా  నటించిన ది  ఫ్యామిలీ మెన్ -  2,  ఎల్టీటీఈ, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా తీశారు అంటూ , ఈ సినిమాపై తమిళనాడు  ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఆమె టెర్రరిస్ట్ పాత్రను పోషించడంతో మరింత రచ్చ గా మారింది. అయితే ఈ వెబ్ సిరీస్ ని నిషేధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కూడా కోరింది. అంతే కాకుండా సమంత వెంటనే క్షమాపణలు చెప్పాలని అక్కడి ప్రజలు కూడా  డిమాండ్ చేస్తున్నారు.


సమంత తాజాగా 2020 లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా  ప్లేస్ ను సంపాదించారు. ఈ సందర్భంగా సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో తమిళ సినీ ప్రేక్షకులు  మాత్రం ఈమెను ఏకిపారేస్తున్నారు.  "shameon you Samantha" అనే హ్యాష్ ట్యాగ్  తో దేశవ్యాప్తంగా ట్రెండ్  చేస్తున్నారు. సమంత వెంటనే క్షమాపణ చెప్పాలి, ది ఫ్యామిలీ మెన్  సీజన్ 2 ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తమిళ వాసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: