నందమూరి బాలకృష్ణకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో బాలయ్య బాబు కూడా ఒకరు.ఆయన్ని అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. అలాంటి అభిమానులు ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ మీద గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు.. ఎందుకు బాలకృష్ణ అభిమానులకు కోపం తెప్పించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాలయ్య బాబు హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న సమయంలో బాలయ్య బాబుకి జోడిగా ఈ సినిమాలో త్రిష నటిస్తుందని కొంతమంది, రకుల్‌ ప్రీతి సింగ్ నటిస్తుందని మరి కొంతమంది ఓ న్యూస్‌ ను రీసెంట్ గా నెట్టింట హల్ చల్ చేసారు.

అలాగే ఈ న్యూస్ తో పాటు ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలయ్య పక్కన నటించడానికి నో చెప్పారనే మరొక  న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకేముంది ఈ న్యూస్‌ విన్న బాలయ్య అభిమానులు ఆ ఇద్దరు హీరోయిన్లపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.అసలు మా బాలయ్య బాబు అంటే ఏమి అనుకుంటున్నారు.అంత ఈజీగా మా బాలయ్యకు ఎలా నో చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు.ఒకానొక సమయంలో త్రిష కెరీర్ గాడిలో ఉన్నప్పుడు లయన్‌ సినిమాలో ఛాన్స్ ఇచ్చి మా బాలయ్య బాబే నిన్ను ప్రోత్సహించారు ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు మా బాలయ్య బాబు సినిమానే రిజెక్ట్ చేస్తావా త్రిషా అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్నారు.


ఇంకా రకుల్ ప్రీతి సింగ్ ను అయితే డిఫరెంట్ గా ట్రోల్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య పక్కన నటించను అని చెప్పినందుకు థాంక్యూ రకుల్ అంటూ రివర్స్‌లో హీరోయిన్‌ రకుల్ ను టార్గెట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ ఇప్పుడు బాలయ్య అభిమానుల కోపానికి గురయ్యారు. ఇదిలా ఉంటే  బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్‌ కన్ఫార్మ్  అయ్యారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అలాగే బాలయ్యతో నటించడానికి శృతి హాసన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: