భారతీయ సినిమా చరిత్రలో తెరకెక్కే ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండు ఉంటుంది. ఒక్కసారి చూస్తే చాలని ఈ విధంగా మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు ప్రేమకథా చిత్రాలను మన భారతీయ ప్రేక్షకులు. అలా కోట్ల మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సినిమా ప్రేమ దేశం. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూసిన తరువాత అప్పటి యువకులు ఈ సినిమాలోని చాలా విషయాలను ఫాలో అయ్యారు. వాస్తవానికి ఈ సినిమాలో లో హైర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు ప్రతి ఒకటి ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా ఫాలో అయ్యారు.

ఈ సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు హీరో వినీత్ మరియు అబ్బాస్ లు. తమిళ హీరోలు అయినా వీరికి తెలుగులో కూడా మంచి పాపులారిటీని వచ్చింది. ముఖ్యంగా వినీత్ తెలుగింటి వ్యక్తి అయిపోయాడు. ఆ క్రేజ్ తోనే కొన్ని మంచి సినిమాలు చేశాడు వినీత్.  అయితే ఎక్కువ కాలం హీరోగా నిలబడలేకపోయాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. స్వతహాగా మలయాళీ అయిన వినీత్ నటి శోభన కు బ్రదర్ . వినీత్ క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో లవర్ బాయ్ కథలు, డాన్సర్ కథలు ఎక్కువగా వచ్చేవి.

తెలుగులో సరిగమలు మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ప్రేమదేశం సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వినీత్ కెరీర్ బాగా సాగుతుందన్న ఆశలు చిగురించాయి.  అనుకున్నట్లుగానే సినిమా అవకాశాలు రావడంతో పది సినిమాలు చేశాడు. వీటిలో ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫ్లాప్ అవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. లాహిరి లాహిరి లాహిరిలో బాపు బొమ్మకు పెళ్ళంట వంటి సినిమాల్లో నటించాడు వినీత్. అయినా కూడా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. చివరిగా చంద్రముఖి సినిమాలో క్లాసికల్ డాన్సర్ గా ఇతని నటన ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: