
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా చికిత్సకోసం వెళ్లిన ప్రజల నుంచి అనేక ఆసుపత్రులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న సంగతి మనం మీడియా పూర్వకంగా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసుపత్రులు ప్రజల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ చిన్న సర్జరీ అయినా సరే ఆసుపత్రికి వెళ్లిన ప్రజలని లక్షల్లో బిల్లు కట్టిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఆసుపత్రి బిల్లులపై అతడు స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగా..
తాను చాలా మంది ఆసుపత్రి బిల్లులను పరిశీలించానని అందులో తనకు తెలిసిన వారు చాలామంది ఏకంగా పది లక్షలకు పైగా ఆసుపత్రి బిల్లులు చెల్లించాలని తెలియచేశాడు. అలాంటి వారిలో చాలా మందికి తాము ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేస్తూనే.. ఆసుపత్రి యాజమాన్యం ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. చిన్న సర్జరీకి కూడా అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాయని అడుగుతునే, ఇలాంటి పరిస్థితులను ఎవరు నియంత్రించలేరా అంటూ హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల భాగంగా హీరో నిఖిల్, అలాగే అతని బృందం కలిసి ఎంతోమందికి నిత్యావసరాల సహాయం అలాగే కరోనా బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తాజాగా చాలామందికి కోలుకునేందుకు వారికి ఇంజెక్షన్లను కూడా ఏర్పాటు చేశాడు.