బాలీవుడ్ సినిమా పరిశ్రమలో బాగా పాపులర్ అయిన నటీనటులలో కొందరు పెద్ద చదువులు చదివితే.. మరికొందరు మాత్రం పదో తరగతి కంటే ఎక్కువగా చదువుకోలేదు. కొందరు 12వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత కాలేజ్ వైపు చూసిన పాపాన పోలేదు. అనుష్క శర్మ వంటి కొందరు స్టార్స్ మాత్రం చిన్నతనం నుంచే టాపర్స్ గా నిలిచి ఎంతో గౌరవాన్ని పొందారు. ఐతే వారిలో ప్రప్రథముడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. నటన పట్ల అమితమైన ఆసక్తితో ఆయన తన మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలో స్టడీస్ డిస్కంటిన్యూ చేసి సినిమాల వైపు మళ్లారు. ఆయన చదవడం చేతకాక ఇంజనీరింగ్ చదువు అర్ధాంతరంగా నిలిపివేయలేదు.


2003వ సంవత్సరంలో ఆయన ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ లో ఆలిండియా ర్యాంక్ 7 సంపాదించారు. ఈ పరీక్షలో ఏడవ ర్యాంకు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. ఈ ఎగ్జామ్ లో బాగా తెలివైన వారు మాత్రమే టాప్ ర్యాంకర్స్ గా నిలుస్తారు. దీన్నిబట్టి సుశాంత్ జీనియస్ అర్థం చేసుకోవచ్చు. మరో విశేషమేమిటంటే.. ఆయన 17-18 ఏళ్ళలోపే జాతీయ స్థాయి ఒలింపియాడ్‌ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచారు. సుశాంత్ ఖగోళ భౌతిక శాస్త్రంపై చాలా ఇష్టం పెంచుకున్నారు. ఒక ఆస్ట్రోనాట్ లేదా పైలెట్ కావాలి అనుకున్నారు కానీ చివరికి బాలీవుడ్ ఫిలిమ్ ఇండ్రస్టీలో అరంగేట్రం చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకొన్నారు.



చదువులో మాత్రమే కాదు నటనలో కూడా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సుశాంత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదగలేకపోయారు. బడా బాలీవుడ్ స్టార్లు బంధుప్రీతితో అతడిని ఎదగనివ్వకుండా తొక్కేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆయన 34 సంవత్సరాల్లోనే ఆత్మహత్య చేసుకుని యావత్ భారతదేశాన్ని విషాదంలో నింపారు. ఒకవేళ సుశాంత్ కి కూడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్నట్లయితే.. బడా హీరోలందరినీ వెనక్కినెట్టి అతనే నెంబర్ వన్ స్థానంలో నిలిచేవారేమో.



ఇక ఇతర బాలీవుడ్ స్టార్ల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ సరసన నటిస్తున్న యువ కథానాయిక అలియా భట్ పదో తరగతిలో 71 శాతం మార్కులు సంపాదించారు. 12వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆమెకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో ఆమె చదువు మానేసి సినిమాల్లో నటించారు.



బాలీవుడ్ ఇండస్ట్రీలో పర్ఫెక్షనిస్ట్ గా పేరొందిన ఆమిర్ ఖాన్ కి చదువంటే అస్సలు ఇష్టం ఉండకపోయేదట. అందుకే ఆయన 12వ తరగతి దాటి చదవలేదని అంటుంటారు. ఇక సోనం కపూర్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ బాలీవుడ్ ప్రముఖులు సైతం 12వ తరగతి దాటి చదువు కొనసాగించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: