సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది ఎన్నో రోజుల నుంచి ఉంది అనే వాదన ఉంది.  కానీ ఏ నటి కూడా గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటకి చెప్పలేదు.  ఆ తర్వాత కాలంలో బాలీవుడ్లో మొదలైన మీటు ఉద్యమంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్పందించారు.  తమ కెరీర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతం చేశారు.  ఇక స్టార్ హీరోయిన్లు సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం సంచలనంగా మారిపోయింది.  అటు బాలీవుడ్ నుంచి మీ టూ టాలీవుడ్ కి కూడా పాకిపోయింది.



 ఎంతో మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.  ఇక ఆ తర్వాత మీ టూ ఉద్యమం కాస్త చల్లారినప్పటికీ.. అప్పుడప్పుడు కొంతమంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కో సమయంలో తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి  నీనా గుప్తా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలను చెప్పారు. ఒక దక్షిణాది ప్రొడ్యూసర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు.



 బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా దర్శకురాలిగా నీనా గుప్తా ఎంతో క్రేజ్ సంపాదించారూ. ఎంతోమంది ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతున్నారు. కాగా ఇటీవలే 'సచ్ కహు తో' అనే పేరుతో నీనా గుప్తా ఇక తన బయోగ్రఫీ ని రాశారు. ఇక ఈ బయోగ్రఫీ  లో గతంలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించిన నీనా గుప్తా.. గతంలో దక్షిణాది చిత్రపరిశ్రమలో  ఒక సౌత్ నిర్మాత సినిమాలో చిన్న అవకాశం కోసం పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ తెలిపారు. ఒక రాత్రి తనతో గడపాలని కోరాడని నీనా గుప్తా తెలిపారు. చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఇలానే ఉంటాయని.. ఇక గాడ్ ఫాదర్ లేకుండా సినీ పరిశ్రమలో రాణించడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: