తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అగ్రహీరోల ఎంట్రీ పైనే ఆధారపడి ఉంటాయి. సీనియర్ హీరోలతో చిన్న సన్నివేశం చేయడమా లేదా వారి చేతే సినిమాకు సంబంధించిన ఏదైనా లాంఛ్ చేయించడం చేస్తుంటారు. దాంతో సినిమాకు పబ్లిసిటీ పెరుగుతుంది.సినిమాలు హిట్ టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతాయి. ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువగా మెగా హీరో చేస్తుంటారు. కొత్త, పాత అనే ఆలోచనను పక్కన పెట్టి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. చాలా సినిమాలలో ఈ హీరోలు ఎంట్రీ ఇచ్చారు కూడా.
మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా మెగా హీరోల సినిమాలలో కీలక సన్నివేశాల్లో కనిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలో చిరు కనిపించాడు. వీరిద్దరి కామినేషన్ లో వచ్చిన సినిమా బ్రూస్ లీ.. ఈ సినిమా కథ మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ పోరాటాలు చూసి ఆకర్షితుడైన కథా నాయకుడు కార్తీక్ తన పేరును కూడా బ్రూస్ లీగా మార్చేసుకుంటాడు. కార్తీక్ ది అందమైన కుటుంబం అమ్మ , నాన్న రామచంద్రరావు , అక్క. కార్తీక్ తండ్రి, జయరాజ్, వసుంధర కు చెందిన వసుంధర పరిశోధనాశాలలో పనిచేస్తుంటాడు.

అదే సమయంలో కార్తీక్ కూడా స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూ తండ్రికి సహాయపడుతుంటాడు.గేమ్స్ డిజైనర్ గా రకుల్ నటిస్తుంది. కట్ చేస్తే జయరాజ్ కుంభకోణాలను కార్తిక్ బయటపెడతాడు. అందుకు పోలీసుల సహకారం కూడా ఉంటుంది. కార్తిక్ అంటే నచ్చని, జయరాజ్, అతని రెండో భార్య కొడుకు చంపాలని ప్లాన్ వేస్తారు. వాళ్ళ నుంచి తన అక్క కుటుంబాన్ని కాపాడతాడు. ఇక రకుల్ తన ప్రియురాలని తెలుసుకొని ఆమెను రౌడీ బ్యాచ్ కిడ్నాప్ చేస్తారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి, రౌడీలా నుంచి రకుల్ ను కాపాడాతాడు. ఈ సన్నివేశం సినిమాకు మంచి క్రేజ్ ను అందించింది. ఇక్కడ ఎవరికీ తెలియని విషయమేంటంటే ఈ సినిమాలో కనిపించినందుకు చిరంజీవి డబ్బులను తీసుకోలేదని సినీ వర్గాల్లో వినిపించింది. ఈ వార్తలో నిజమెంతో వారికే తెలియాలి. ఇలా చిరు తన కొడుకు సినిమాలలోనే కాదు.. చాలా సినిమాలలో కనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: