ఇలా అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన తరుణ్ కెరీర్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. 2011లో వచ్చిన "చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి" సినిమా తరువాత ఏడు సంవత్సరాలు గ్యాప్ వచ్చిందంటే పరిస్థితి ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. చివరగా తరుణ్ నటించిన సినిమా "ఇది నా లవ్ స్టోరీ". ఆ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కారణాలు ఏమైనప్పటికీ తరుణ్ కెరీర్ మాత్రం తానే చేజేతులా నాశనం చేసుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే తరుణ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రేక్షకుల దృష్టిలో నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రీసెంటుగా మలయాళ మూవీకి తెలుగు రీమేక్ అయిన "అనుకోని అతిధి" లో ఫహద్ ఫాజిల్ కు డబ్బింగ్ చెప్పాడు.
తరుణ్ వాయిస్ బాగా కుదరడంతో ఫహద్ ఫాజిల్ నెక్స్ట్ సినిమా పుష్ప లో కూడా అతనికి డబ్బింగ్ చెప్పనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఒక యువ దర్శకుడు ఒక స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతనికి వెబ్ సిరీస్ లు తీసిన అనుభవం మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ వార్తా నిజంగా తరుణ్ అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమే. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి