
రొమాంటిక్ కామెడీ పొలిటికల్ డ్రామాగా వచ్చిన "ఎంఎల్ఏ" సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉపేంద్ర మాధవ్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రథమార్థంలో హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిద్దరి మధ్య చోటుచేసుకునే కామెడీ ట్రాక్ ఆద్యంతం హాస్యాస్పదంగా ఉంటుంది. హీరోయిన్ ని తన బుట్టలో వేసుకునేందుకు హీరో ప్రయత్నించే క్రమంలో ప్రతినాయకుడితో పోరాడాల్సి ఉంటుంది. దీంతో ఎంఎల్ఏ ఫస్ట్ ఆఫ్.. కామెడీ, రొమాంటిక్ ట్రాకుల నుంచి యాక్షన్ ట్రాక్ లోకి అడుగు పెడుతుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ లో కథ ఏంటనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటెయిన్ చేశారు.
అయితే సెకండాఫ్ లో మంచి లక్షణాలున్న అబ్బాయి కళ్యాణ్ రామ్ ఏకంగా ఎమ్మెల్యే అయిపోవాలని అనుకుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని పెళ్లి చేసుకునేందుకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యేందుకు నడుం కడతారు. "నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు.. చేయడం మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ మిగిలి ఉండదు.." వంటి పొలిటికల్ డైలాగులతో ఎంటర్‌టైన్ చేస్తారు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ఒక అనామకుడు అయిన కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఘన విజయం సాధిస్తారు. ఇలాంటి సరికొత్త స్టోరీ లైన్ తో వచ్చిన ఎంఎల్ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే చిన్న పిల్లలను బడికి పోనివ్వకుండా తన గాజు ఫ్యాక్టరీలో పని చేయిస్తుంటారు. అలాగే ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎలాంటి మంచినీటి సదుపాయాలు ఉండవు. దీంతో ఆ నియోజకవర్గం నీటి కొరతతో చాలా దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. అయితే ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్న అతి ముఖ్యమైన సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నిటినీ కళ్యాణ్ రామ్ పరిష్కరించి పాపులర్ అవుతారు. కళ్యాణ్ రామ్ రాజకీయంగా ఎదగడం గమనించిన ఎమ్మెల్యేకి చిర్రెత్తుకొస్తుంది. దీంతో అతడిపై హత్యా ప్రయత్నానికి ఒడిగడతాడు. దీంతో కళ్యాణ్ రామ్ ఆస్పత్రి పాలవుతారు. ఈ విషయం కాస్త సామాన్య ప్రజానీకానికి తెలియడంతో కళ్యాణ్ రామ్ పై సహజంగానే సింపతి పెరిగిపోతుంది. దీంతో అతను ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎమ్మెల్యే అవుతారు. ఈ చిత్రంలో పవన్ రాజకీయ సన్నివేశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎంఎల్ఏ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో వచ్చిన ఉత్తమ పొలిటికల్ డ్రామా అని చెప్పుకోవచ్చు.