సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే తెలుగు లోకి రాకముందే మలయాళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా చేస్తున్నప్పుడే ఆమెకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆమె తెలుగులో సినిమా చేయాలనే డిమాండ్ పెరిగిపోయింది. తాను ఎంత త్వరగా వస్తే అంత త్వరగా స్టార్ హీరోయిన్ ను చేస్తామని ప్రేక్షకులు బహిరంగంగా చెప్పారు. అందరూ అనుకున్నట్లే ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సాయి పల్లవి.

అమె నటన గురించి, ఆమె నాచురల్ బ్యూటీ గురించి అప్పటికే తెలిసి ఉన్న ప్రేక్షకులు ఫిదా సినిమాలో ఆమెను చూస్తూ మైమర్చిపోయారు. రెండు కళ్ళతో రెండు గంటలు సాయి పల్లవి నే చూపు తిప్పుకోకుండా  చూసి ఆమెను స్టార్ హీరోయిన్ గా మలిచేశారు. ఆమె ఏ సీన్ లో నటించిన కూడా పొగుడుతూ, ఆ నటన తనకు మాత్రమే సాధ్యమైనదని చెబుతూ ఆమె కోసం ఆ సినిమానే సూపర్ హిట్ గా చేశారు ప్రేక్షకులు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ను మరో ఖుషీగా అభివర్ణిస్తూ భూమికను సాయి పల్లవి తో పోల్చారు.

మలయాళంలో కూడా ఇదే సహజమైన నటనతో కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకుని టాలీవుడ్ లో పాగా వేసి ఇక్కడి ప్రేక్షకులను కూడా తన అభిమానులుగా మార్చుకొని ఇప్పుడు తమిళంలో కూడా ప్రవేశించి అక్కడకూడా అందరిని మైమరిపించే లా చేస్తుంది. ఏదేమైనా సౌత్ మొత్తం డిమాండ్ ఉన్న హీరోయిన్ గా సాయి పల్లవి నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భవిష్యత్తులో ఈమె పాన్ ఇండియా  హీరోయిన్ గా మారి దేశాన్ని మొత్తం ఆకట్టుకునే హీరోయిన్ గా మారుతుందా లేదా అనేది చూడాలి. టాలీవుడ్ లో సాయి పల్లవి కి ప్రస్తుతం మూడు సినిమాలకు పైగా అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: