ప్రేక్షకుల అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో గతంలో చాలా సందర్భాల్లో స్టార్ హీరోల అభిమానులు నిరూపించారు. అవసరమైతే హీరోల కోసం తమ ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటారు అభిమానులు. హీరోలకోసం  అన్నీ కోల్పోయిన వారి లో  పిచ్చి అభిమానం ఇంకా దేనికో దారి తీస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ అభిమానంతో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కాదు. ఏదేమైనా అభిమానం హద్దు లో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. హద్దు మీరితే హీరో కూడా ఏమీ చేయలేడు.

 సాంకేతిక బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ హీరో పై అభిమానాన్ని వెల్లడిస్తున్నారు. వేరే హీరో తమ హీరో ని ఏమన్నా అంటే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆ హీరో నీ బ్యాడ్ చేస్తున్నారు కూడా. ఆన్ లైన్ లో అప్పుడప్పుడు మనం ఫ్యాన్ వార్ చూస్తూ ఉంటాం. ఇదిలా ఉంటే ఓ అభిమాని తనకున్న విపరీతమైన అభిమానంతో సోనూసూద్ ను కలవడానికి ఏకంగా వికారాబాద్ నుంచి ముంబైకి పయనమయ్యాడు. కొన్ని వందల కిలోమీటర్లు సోనూసూద్ కోసం, ఆయన్ని కలవడం కోసం ఒక ఫ్లకార్డుతో బయలుదేరి చివరికి ఆయన్ను కలిసి తన కోరిక తీర్చుకున్నాడు.

ఇప్పుడు హీరోయిన్ రష్మిక కోసం ఏకంగా తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు మరో అభిమాని. కన్నడ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ కి వచ్చిన రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అందానికి ఫిదా అయిన ఓ అభిమాని ఆమెను చూడడానికి 900 కిలోమీటర్లు ఏది దొరికితే అది పట్టుకుని వెళ్లాడు. లాక్ డౌన్ ఇబ్బందులు తనను ఆపలేదు. పోలీసులు సైతం తనని తన ప్రయాణాన్ని అడ్డుకోలేక పోయారు. ఎలాగైతేనేం చివరికి ముంబైలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రష్మిక మందన కలిశాడు. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: