బుల్లితెర ప్రేక్షకులకు నటి కస్తూరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్ లో అద్భుత నటనను కనబరుస్తూ సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి. ఇక తెలుగులో ప్రముఖ చానెల్ లో ప్రసారమయ్యే 'గృహలక్ష్మీ' అనే సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ చేస్తోంది కస్తూరి.ఇక సీరియల్స్ తో పాటు రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ..మరింత పాపులారిటీని సంపాదించుకుంది.స్వతహాగా ఈమె లాయర్ కావడం..సామాజిక, రాజకీయ అంశాలపై ఎక్కువ పట్టు ఉండడంతో ఈమె సంధించే ప్రశ్నలు.. వాటి విశ్లేషణలు నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈమె మరో అంశం పై స్పందించారు.

అదీ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో కావడం గమనార్హం. ప్రస్తుతం సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రజినీకాంత్..ఈ మధ్య కాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.అయినా కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.అయితే రోజు రోజుకి తనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఆ ఆలోచనను మధ్యలోనే విరమించుకున్నారు.ప్రస్తుతం 'అన్నాతే' అనే సినిమాలో నటిస్తున్న రజినీకాంత్.. ఇటివలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి..కొన్ని అనారోగ్య కారణాల వల్ల అమెరికా వెళ్లారు.తాజాగా ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఇదే విషయంపై నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాలా రోజుల నుంచి మన భారతీయులకు అమెరికా వెళ్లేందుకు అనుమతి లేదు.అలాంటి పరిస్థితిలో ఇప్పుడు రజినీకాంత్ అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించింది కస్తూరి.ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మనకు అక్కడికి వెళ్లే అవకాశం లేదు.అలాంటిది రజినీకాంత్ ఎలా వెళ్లారో అర్థం కావడం లేదు?అప్పుడేమో రాజకీయాల్లో నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు ఇప్పుడేమో ఇలా అమెరికా వెళ్లారు.అసలేం అర్థం కావడం లేదు.రజినీ సార్ ప్లీజ్ అన్ని క్లారటీ గా చెప్పండి.మేయో క్లినిక్ అంటే గుండెకు సంబంధించింది.మరీ రజినీ సార్ ఆరోగ్య సమస్య ఏంటీ?అంటూ రకరకాల ప్రశ్నలను సంధించింది నటి కస్తూరి.ప్రస్తుతం ఈమె తన ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: