నందమూరి బాలకృష్ణ కు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పాత కథలు చేసినా అవి బాగుంటే జనాలు ఎగబడి చూస్తారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ పెట్టింది పేరుగా నిలిచారు. మొదటి నుంచి బాలయ్య మాస్ ఇమేజ్ తో పాటు ఈ సినిమాలలో కూడా చేసుకుంటూ వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సెంటిమెంట్ సినిమాలకు కూడా పెద్ద పీట వేస్తూ ఆయన ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఇక ఇండస్ట్రీ లో ఉండే సెంటిమెంట్ల గురించి అందరికీ తెలిసిందే. ఒక విధంగా సినిమాలు హిట్ అయితే అదే విధానాన్ని తమ ప్రతి సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ ఉంటారు హీరోలు నిర్మాతలు దర్శకులు.
నిర్మాతలకు హీరోలకే కాదు అభిమానులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. అలా బాలకృష్ణ సినిమా లో సింహ అనే టైటిల్ పదం టైటిల్లో వస్తే ఆ సినిమాలు హిట్ బొమ్మ అని వారు నమ్ముతుంటారు అలా సింహ పదం తో బాలయ్య చేసన సినిమాలు ఏంటో చూద్దాం. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ సింహం నవ్వింది అనే సినిమా చేయగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత 1994వ సంవత్సరంలో కోదండరామి రెడ్డి డైరెక్షన్ లో బాలయ్య బొబ్బిలి సింహం అనే సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ బి.గోపాల్ డైరెక్షన్ లో చేసిన సమరసింహా రెడ్డి సినిమా రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి.
బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మరొక సినిమా నరసింహనాయుడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. సీమ సింహం సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకోగా ఆ తర్వాత ఆయన చేసిన లక్ష్మీ నరసింహ చిత్రం మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిపోతుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో ని సింహ సినిమా. అప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణకు రిలీజ్ ఇచ్చిన మూవీ ఇది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన జై సింహ, ఆ తర్వాత కొత్త దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో చేసిన లయన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. బాలకృష్ణ సింహ అని అర్థం వచ్చేలా టైటిల్స్ పెట్టుకున్నా సినిమాలు చాలా వరకు ఫ్లాపులుగా మిగిలడంతో ఈ సినిమా టైటిల్స్ భవిష్యత్తులో పెట్టుకోక పోవడమే మంచిదని బాలయ్య అభిమానులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి