
అయితే సోను సూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కేవలం కొవిడ్ పేషెంట్లకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించడం వరకు కొనసాగుతోంది. వైద్య చికిత్స అందించేందుకు సోనూసూద్ చేయని పనులు లేవనే చెప్పాలి. ఇక తాజాగా ఆయన సీఏ చదవాలనుకునే పేద విద్యార్థుల కోసం గొప్ప వరాన్ని ప్రకటించారు.
తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఉచిత సీఏ కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ఇంటర్న్‌షిప్, కోచింగ్, ప్లేస్‌మెంట్‌లను ఇప్పిస్తామని కూడా స్పష్టం చేశారు. తమ సూద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తామని సోనుసూద్ ప్రకటించాడు. పేద విద్యార్థులు ఎవరైనా చదవాలనుకుంటే తామే బాధ్యత తీసుకుంటామని సోనూ చెప్పాడు.
