తెలుగులో అనుపమ "అ ఆ" సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత శతమానంభవతి మూవీతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అలా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా అనుపమకు ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు ఈమెకు. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆమె తిరస్కరించింది. అలా కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ తన చేతులారా చేజార్చుకుంది.
అనుపమ ప్రతి సినిమాలోనూ ఒకేలా కనిపించడంతో ప్రేక్షకులకు చూసి చూసి బోర్ కొడుతుంది. అలా అనుపమ కెరియర్ కొంచెం డీలా పడిందని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఈ సినిమాతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. క్రెడిట్ మొత్తం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి వెళ్ళిపోయింది. ఇక అనుపమ చేతిలో రీసెంట్ గా 18 పేజీలు అనే సినిమా చేస్తోంది.
ఇక సోషల్ మీడియాకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. అయితే ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు కానీ, సినిమా షూటింగ్ లకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక అంతే కాదు తనకు సంబంధించిన ప్రతి ఫోటోని కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఈమె రీసెంట్ గా తనకు బోర్ కొడితే ఎలా ఉంటుందో చూపించింది. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో ఏంటో ఒకసారి లుక్ చేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి