
నాటి నుంచి నేటి వరకు సినీ ప్రముఖులు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అలనాటి అన్నయ్యగా ప్రజల చేత మన్ననలు పొందిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తో మొదలు పెట్టి, పలువురు కమలహాసన్, రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సైతం రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ వారి తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంతో హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తన పదవిని కొనసాగిస్తున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరొకవైపు రాజకీయాలలో కూడా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇంకా అంతే కాదు హీరోయిన్ రోజా కూడా ఇలాంటి కోవకు చెందినవారే. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు సరికొత్తగా రాజకీయ నేతలు కూడా సినీ ఇండస్ట్రీ పై ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేసి శాసనసభ్యుడిగా గుర్తింపు పొంది, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న పువ్వాడ అజయ్ కుమార్, తన తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ ను సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు తన తనయుడు డాక్టర్. పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా, పలువురు సినీ ప్రముఖులను కూడా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.
ఈరోజు ఉదయం తెలంగాణ సీఎంఓ , మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకోగా, ఆ తర్వాత మన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా కలిసి అక్కడ కేక్ కట్ చేయించి మరీ , ఆయన ఆశీర్వాదాలు నయన్ రాజ్ తీసుకోవడం గమనార్హం. అంతేకాదు మధ్యాహ్నం 1:00 సమయంలో పువ్వాడ అజయ్ కుమార్ తన తనయుడితో కలసి మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవడం జరిగింది. ఇక అక్కడ కూడా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుని చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకున్నారు నయన్.
ఇక ఈ విషయాలన్నీ స్వయంగా అజయ్ కుమార్ పువ్వాడ తన అధికారిక ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకోవడం విశేషం.. ఆయన ట్వీట్ చేస్తూ.." నా తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలవడమైనది" అంటూ ఆ ఫోటోలు కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.