మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న 'మా' ఎన్నికలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.ఇప్పటికే లోకల్ నాన్ లోకల్ అనే వివాదం పై ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. ఈ విషయంపై కొంతమంది ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు మద్దుతుగా మాట్లాడగా కొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలక్షన్స్ లో ఆయనకి ఏం పని అని చాలా మంది అన్నారు.

అయితే ఇన్ని రోజులు అంత హాట్ టాపిక్ అయిన ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయింది. ఇక ఇప్పుడు ప్రకాష్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి "ఎలక్షన్స్ ఎప్పుడు" అని సెటైర్ వేసినట్టు పోస్ట్ పెట్టారు.ఇన్ని రోజులు ఇంత హడావిడి చేసిన మా ఎలక్షన్స్ ఇంకా డేట్ ప్రకటించకపోవడం నిజంగా అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇన్ని రోజులు వేదికల మీద ప్రశ్నించన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ట్వీట్స్ వెయ్యడం మొదలుపెట్టారు. అయితే ప్రకాష్ రాజ్ మెగా ఫామిలీ నుంచి గట్టి సపోర్ట్ ఉంది. 

అలాగే చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన్ని సపోర్ట్ చేయడంతో ఈసారి ప్రకాష్ రాజ్ గెలవడం ఖచ్చితం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు 'మా' ఎన్నికలలో ప్రకాష్ రాజ్ కి పోటీగా మంచు విష్ణు ఉన్నారు. మంచు విష్ణు మన మా ని మనమే బాగుచేసుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మంచు విష్ణు కి కృష్ణ గారి దగ్గరనుంచి మరియు నరేష్ సపోర్ట్ లభిస్తోందని తెలుస్తోంది. ఇక హేమ, సీవీల్ నరసింహా రావు తమ పోటీ చేస్తున్నాం అని ప్రకటించగా జీవిత రాజశేఖర్ ఎంట్రీ ఇంకా కాంఫైర్మ్ కాలేదు.అయితే ఈసారి మా ఎలక్షన్స్ మాత్రం ఎన్నడూ లేని విధంగా చర్చల్లో నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: