
విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ తన అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుని సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిన కూడా కొన్ని సినిమాలు చేసి ఆమె దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తన కళ్ళ తోనే మాయ చేసే ఐశ్వర్యారాయ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ప్రేక్షకులను తన నటనతో మాయ చేసింది. ఇద్దరు సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్ బాలీవుడ్లో సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

తెలుగులో రావోయి చందమామ సినిమాలో స్పెషల్ సింగ్ చేయడం తప్ప ఏ తెలుగు సినిమాలోనూ డైరెక్ట్ గా నటించలేదు ఐశ్వర్య రాయ్. కానీ ఆమె నటించిన కాలా తమిళ సినిమాలు తెలుగులో అనువాదాలు గా రావడం తో ఆ సినిమా ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యింది ఐశ్వర్యరాయ్. నిజానికి ఐశ్వర్య రాయ్ తనకున్న అందానికి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ రేంజ్ కి వెళ్లాల్సిన నటి. కానీ ఆమె చేసిన ఓ తప్పు ఇక్కడకే పరిమితం చేసింది.
ఆమెకు హాలీవుడ్ లో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. బ్రాడ్ ప్రిట్ హీరోగా నటించిన ట్రాయ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసే ఛాన్స్ వరించిందట. కానీ హాలీవుడ్ సినిమాలు అంటేనే ఎక్స్ పోజింగ్ బాగా చేసే సినిమాలు గా ఉంటాయి. అలాంటి సినిమాల్లో మన ఇండియన్ నటీమణులు ఎక్కువగా నటించడానికి ఆసక్తి చూపరు. ఆ విధంగానే ఈ సినిమాలో చాలా అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయని ఏ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ సంచలన విజయం నమోదు చేసుకోగా ఈ సినిమాలో కనుక ఐశ్వర్య రాయ్ నటించి ఉంటే వేరే లెవెల్ క్రేజ్ దగ్గించుకునేది ఐశ్వర్యరాయ్.