తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి తరువాత ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుల లిస్టులో కొరటాల శివ రెండవ స్థానంలో ఉంటే ఆతరువాత స్థానంలో అనీల్ రావిపూడి కొనసాగుతున్నాడు. దీనితో కొరటాల మూవీ అంటే మరొక సూపర్ హిట్ అన్న ప్రచారంతో పాటు బయ్యర్లలో కూడ మంచి క్రేజ్ ఉంది.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత కొరటాల జూనియర్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా మూవీ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు ఈ మూవీకి ప్రారంభం కాకుండానే ఈమూవీ పై ఒక నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారం మొదలైంది. దీనికి కారణం రాజమౌళి సినిమాల సెంటిమెంట్ అని అంటున్నారు. రాజమౌళి సినిమాలలో నటించి బ్లాక్ బష్టర్ కొట్టిన హీరోలు వెంటనే మరొక దర్శకుడుతో చేసే మూవీ ఫ్లాప్ కావడం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది.


ఈ విషయంలో జూనియర్ కెరియర్ ను పరిశీలిస్తే రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ మూవీలో నటించిన తరువాత వెంటనే చేసిన ‘సుబ్బు’ మూవీ ఫ్లాప్. అదేవిధంగా జూనియర్ రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బష్టర్ ‘సింహాద్రి’ తరువాత నటించిన ‘ఆంధ్రావాల’ భయంకరమైన ఫ్లాప్. ఇదే సెంటిమెంట్ కొనసాగిస్తూ ‘యమదొంగ’ మూవీ తరువాత జూనియర్ నటించిన ‘కంత్రి’ కూడ ఫ్లాప్ అయింది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత జూనియర్ కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కూడ ఫ్లాప్ అవుతుందా అంటూ ఈమూవీ ప్రారంభం కాకుండానే ఈమూవీ పై నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారం మొదలైంది.


వాస్తవానికి రాజమౌళి సినిమాలలో నటించి బ్లాక్ బష్టర్ హిట్స్ అందుకున్న తరువాత చాలామంది హీరోలకు ఇలాంటి ఫ్లాప్ ల సెంటిమెంట్ వెంటాడింది. రామ్ చరణ్ ‘మగధీర’ తరువాత నటించిన ‘ఆరెంజ్’ ఫ్లాప్. అదేవిధంగా రవితేజా ‘విక్రమార్కుడు’ సక్సస్ తరువాత నటించిన ‘ఖతర్నాక్’ ఫ్లాప్ గా మారింది. రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన ప్రభాస్ ‘ఛత్రపతి’ మూవీ తరువాత నటించిన ‘పౌర్ణమి’ ప్రభాస్ మరిచిపోలేని భయంకరమైన ఫ్లాప్ ఇలాంటి అనుభవాలు రాజమౌళితో సినిమాలు చేసిన సునీల్ నితిన్ లకు కూడ ఉన్నాయి. ఈపరిస్థితులలో జూనియర్ కొరటాలమూవీ కూడ ఫ్లాప్ అవుతుందా అంటూ ప్రచారంలోకి వచ్చిన నెగిటివ్ రూమర్ ఇండస్ట్రీలోని సెంటిమెంట్లను మరొకసారి రుజువు చేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: