ప్రస్తుతం టాలీవుడ్ లో తమిళ నాడు జోరు ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడి హీరోలు తెలుగు సినిమాలు చేస్తున్నారు. ధనుష్ శేఖర్ కమ్ముల తో సినిమాను చేస్తుండగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నారు ధనుష్.  గతంలో ఎప్పుడూ స్ట్రైట్ తెలుగు సినిమా చేయని ధనుష్ ఈసారి సినిమా చేయడంతోనే ఆయన పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక మరో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తుండడం విశేషం. ఆయన దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు సినిమా చేస్తున్నాడు. 

ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా వంద కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. హీరోలు కాకుండా దర్శకులు కూడా తెలుగులో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తమిళ అగ్ర దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఓకే అన్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. వేసవిలో విడుదల కాబోతుంది. అలాగే లింగుస్వామి ఓ సినిమా చేయబోతున్నాడు.  అక్కడి హీరోలు దర్శకులు గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా తెలుగు సినిమాలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

ఇప్పుడు నటీ నటులు కూడా తెలుగు పై దృష్టి సారిస్తున్నారు. విజయ్ సేతుపతి ఇప్పటికే ఉప్పెన సినిమాలో నటించి మరొక తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతుండగా తమిళంలో దర్శకుడు నటుడు అయిన సముద్రఖని కూడా తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. అంతేకాకుండా తమిళనాట నటుడిగా మంచి పేరు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పశుపతి కూడా తెలుగులో సినిమా చేయడానికి చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఇలా తమిళంలో స్టార్ లు గా ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు సినిమా పై కాన్సన్ట్రేట్ చేయడం దేనికి దారి తీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: