తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఉన్న భారీ అభిమానులు ఆ సినిమాను 100 రోజులు ఆడించేదాకా వదిలిపెట్టరు. అంత అభిమానం ఉన్న ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయడానికి భయపడ్డారట. అది కూడా సూపర్ హిట్ అయిన సినిమాను విడుదల చేయడానికి ఎంతగానో ఆలోచించారట. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలా మెదిలిన ఎన్టీఆర్ , ఏఎన్నార్ నటించిన ఈ సినిమా ఎందుకు విడుదల చేయడానికి భయపడ్డారు ఇప్పుడు చూద్దాం. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ హిట్ గా నిలిచే చిత్రం గుండమ్మ కథ. ఎన్టీఆర్ ఏఎన్నార్ హీరోలుగా సావిత్రి జమున హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ చిత్రం. ఎస్.వి.రంగారావు సూర్యకాంతం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీవీలో ఇప్పటికీ వచ్చిన దానికి ఉండే క్రేజ్ వేరే. టీవీలకు జనాలు అతుక్కుపోయి మరీ ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమా మాటలు డి.వి.నరసరాజు రాశారు. 

రీమేక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు స్టార్ కాంబినేషన్ కుదరక ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. చివరికి ఎన్టీఆర్ ఏఎన్నార్ లు ఈ సినిమా కలిసి చేయడానికి ఒప్పుకోవడంతో ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కాలంలో ఈ సినిమాను నందమూరి అక్కినేని వారసులు తెరకెక్కించాలని చూసిన వర్కవుట్ అవ్వలేదు. నాగార్జున బాలకృష్ణ ఈ సినిమా చేయాలని కొంత ప్రయత్నించినప్పటికీ సరైన రీజన్ అయితే తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. అలాగే ఈ తరం జనరేషన్ లో ఎన్టీఆర్ నాగచైతన్య కూడా ప్రయత్నించగా ఇద్దరు స్టార్డమ్ లు వేరువేరుగా ఉండడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. దాంతో గుండమ్మ కథ సినిమాను ఈ తరం జనరేషన్ చేయాలని భావించగా అది వర్కవుట్ అవ్వలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: