
అల్లుడు శీను సినిమా తో వెండితెరకు పరిచయమైన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు అరడజన్ కి పైగా సినిమాలు చేసి సరైన హిట్ పడక వరుస సినిమాలు చేస్తూ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఆయన వివి వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ సినిమా లో ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు లో సూపర్ హిట్టయిన చత్రపతి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ పరిచయం కాబోతున్నాడ ట బెల్లంకొండ శ్రీనివాస్.
చత్రపతి సినిమా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగు లో తెరకెక్కగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా వేరే భాషలో ఎందుకు రీమేక్ చేయలేదా అన్న సందేహం అందులో నెలకొనగా ఇప్పుడు తెలుగు హీరో తెలుగు సినిమా నీ తెలుగు డైరెక్టర్ తో హిందీ లో చేయడం విశేషం. అయితే ఈ సిని మా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రాజమౌళి తో ఓ ప్రయోగం చేయబోతున్నాడట. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తెలుగులో ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన రాజమౌళిని ఆహ్వానించ బోతున్నాడట.
మరి దీనికి రాజమౌళి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. ఏదేమైనా బెల్లంకొండ శ్రీనివాస్ లో హిట్ కొట్టాలనే తపన ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను ఈ రోజే విడుదల చేసిన చిత్ర బృందం ఈ వీడియో ద్వారా సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.