మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో రామ్ చరణ్ ఆయనకు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిచిన ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ పాట విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఎప్పుడూ బయటకి వచ్చింది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. వారిపై సెటైర్లతో ప్రస్తుతం సమాజంలో ఉన్న లోపాలను ఎత్తిచూపే హీరో పాత్రలో చిరంజీవి చేస్తున్నాడట. గతంలో చాలా సినిమాల్లో చిరంజీవి ఈ తరహా పాత్రలో నటించగా అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా అదేవిధంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్. వారి అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.

ఇక కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా మలిచాడు అని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటన దానికి తోడై ఈ సినిమా మరుపురాని హిట్ గా నిలుస్తుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి వరస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రీమేక్ కు, ఒక తెలుగు సినిమా చేస్తున్న చిరంజీవి మొదటగా మలయాళ సూపర్ హిట్ చిత్రం లుసిఫార్ మోహన్ రాజా దర్శకత్వంలో మొదలుపెట్టనున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలోనీ వే కూడా ఆ వెంటనే మొదలుపెట్టనున్నాడు.  ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే టైంలో పూర్తి అవుతున్నాయట. ఇక బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కొంచెం టైం పట్టేలా ఉంది. మరి ఈ నాలుగు సినిమాల్లో చిరంజీవి ఏ సినిమాతో సూపర్ హిట్ అనుకుంటడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: