సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే. ఈయన  సినిమా విడుదల అయిందంటే చాలు, ఏకంగా కొన్ని కొన్ని సంస్థలు సెలవు దినాన్ని ప్రకటిస్తాయి. ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరీ. అయితే ఈయన గురించి తనికెళ్ళ భరణి గారు కొన్ని విషయాలను బయట పెట్టారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

రజినీకాంత్ పూర్తి పేరు "శివాజీరావ్ గైక్వాడ్". ఈయన కర్ణాటకలో జన్మించారు. అయితే రజినీకాంత్ గారు సినిమాల్లోకి రాకముందు ఆకలితో అలమటించిన రోజులు చాలానే ఉన్నాయని , టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

ఒకానొక సమయంలో రజినీకాంత్ వారి ఇంట్లో రజనీకాంత్  భోజనం చేసేటప్పుడు ,తనకి ఇంకొక రాగిముద్ద కావాలని వాళ్ళ అమ్మ ని అడగగా.. వాళ్ళ ఆమ్మ ఇచ్చేది కాదని, దాంతో కావాలంటే తన రాగి ముద్ద తీసుకోమని చెప్పేదని చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి. వాళ్ళ ఇంట్లో కేవలం ఆరు రాగిముద్ద లు మాత్రమే చేసుకునే వారని, రజనీకాంత్ కు తన తల్లి తినే ముద్ద కూడా ఇచ్చేవారని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

అంత దీనస్థితిలో ఉన్న రజనీకాంత్ కు తన తల్లి ఎన్నో జాగ్రత్తలు నేర్పిందట. అందుచేతనే రజనీకాంత్ కు  డబ్బు పట్ల అంత గౌరవం వచ్చిందని తెలియజేశారు తనికెళ్ల భరణి. ఎక్కువ డబ్బు సంపాదించిన వారి పిల్లలకు ఈ జాగ్రత్తలు, గౌరవం తెలియకపోవచ్చు అని తెలియజేశారు. కానీ సినిమా మాత్రం తనకు ఎలాంటి చెడు అలవాట్లు నేర్పలేదు అని తనికెళ్ళభరణి చెప్పుకొచ్చారు.

ఇక సిగరెట్ కూడా మానేశాక తన ఆరోగ్యంగా ఉన్నాన నీ, బ్రహ్మానందం మరికొందరికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్పారు తనికెళ్ళ భరణి. ఇంకా ఇప్పటికి కూడా తనికెళ్ళభరణి సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన రజనీకాంత్ తో  అన్న పై అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: