టాలీవుడ్ లో ఎంతోమంది మరపురాని నటీమణులు తమ అభినయంతో ఆకట్టుకునే అందం తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. వారు సినిమాలు చేయకపోతే ఎందుకు చేయట్లేదని ఆరా తీసే ప్రేక్షకులు కూడా ఉన్నారు అంటే వారు తమ నటనతో వారిని ఎంతగా అలరించారో అర్థం చేసుకోవచ్చు. అలా ఇప్పటికీ తెలుగు ప్రజలు గుర్తుంచుకున్న నటీమణులలో ఒకరు శ్రీ విద్య. ముద్దుగా బొద్దుగా మురిపించే అభినయం, ఆకట్టుకునే అందం తో ఆమె తెలుగు ప్రేక్షకులను కొన్ని సంవత్సరాలుగా అలరిస్తూనే ఉన్నారు.

స్వర్గీయ లెజండ్రీ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తాతా మనవడు, బలిపీఠం, కన్యాకుమారి, తూర్పు-పడమర వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దగ్గించుకొని దక్షిణాదిన అన్ని భాషల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మురిపించారు శ్రీ విద్య. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో హీరోయిన్ గా కనిపించిన ఆమె ఆ తర్వాత కాలానికి అనుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి అక్కగా చెల్లిగా వదినగా తల్లిగా పాత్రలు చేస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

ఆమె నటించిన ఇతర భాషల లోని కొన్ని సినిమాలు తెలుగులో అనువాద చిత్రాలు గా విడుదలై విజయాన్ని సాధించాయి. అప్పట్లో శ్రీ విద్య కమలహాసన్ జంట అంటే ప్రేక్షకుల్లో మరో రేంజ్ లో క్రేజ్ ఉండేది. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన అపూర్వ రాగంగల్ సినిమాలో వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ చిత్రంలో రజనీకాంత్ భార్య గా నటించగా, రజనీకాంత్ తొలి సినిమా ఇది. ఆయన సరసన నటించిన తొలి హీరోయిన్ గా చరిత్రలో నిలిచిపోయారు శ్రీ విద్య. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో వీరి కాంబో లో  నటించింది. సంగీతపరంగా కూడా ఆమె ప్రఖ్యాతరాలు. ఆమె తల్లి ఎమ్.ఎల్.వసంతకుమారి ప్రముఖ కర్ణాటక సంగీత గాయని కావడంతో శ్రీవిద్య కూడా ఆ సంగీతాన్ని కొంత సాధన చేశారు. దాంతో తమిళ మలయాళ చిత్రాల్లో కూడా ఆమె గాయని గా రాణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: