టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అంటే కమర్షియల్ చిత్రాలలో నటించి ప్రేక్షకులచే ఈలలు గోలలు పెట్టించేవారు. వారి సినిమా వస్తుందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు ఎగబడి మరీ వారి సినిమాలను తిలకిస్తారు. ఆ రోజు ఏ పని ఉన్నా పక్కన పెట్టి సినిమా విడుదలను ఒక పండగ లా జరుపుకుంటారు.అయితే స్టార్ లు గా ఎదిగిన తర్వాత మన హీరోలు ఒకే సినిమాలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు అదే కమర్షియల్ సినిమాలు.  కమర్షియల్ సినిమాలలో నటిస్తేనే వారికి బాగా డబ్బు వస్తుంది అందుకే వారు అలాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించాలని చూస్తారు.

అయితే ఇక్కడే అసలు కిటుకు ఉంది. చిన్న హీరోలు ఫేడవుట్ అయిపోయిన హీరోలు మాత్రమే లేడీ ఓరియంటెడ్ లాంటి చిన్న చిన్న సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటారు. పెద్ద హీరోలు ఎవరు హీరోయిన్ ప్రధాన పాత్ర ఉన్న సినిమా లలో నటించడానికి ఒప్పుకోరు. అందుకు కారణం వారి ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందనే. నిజానికి మనం చాలాకాలం నుంచి గమనిస్తే మన హీరోలు తమకు ప్రాధాన్యం లేని ఏ సినిమాలో కూడా నటించలేదు.

కమర్షియల్ గా తమకు పేరు వచ్చే డబ్బు వచ్చే సినిమాల్లో మాత్రమే నటించి పాపులారిటీ అందుకున్నారు కానీ హీరోయిన్ ప్రధానంగా సాగే ఏ సినిమాలో పెద్ద హీరోలు ఎప్పుడూ నటించలేదు. కానీ గతంలో అందరు హీరోలు అన్ని రకాల పాత్రలు అన్ని రకాల సినిమాల్లో నటించారు. కానీ ఇప్పటి తరం వారు అలా నటించ లేకపోతున్నారు. దీనిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమా ల పట్ల హీరోల దృక్పథం మారాలి అని చెప్పింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో పెద్ద హీరో లు సైతం నటిస్తే బాగుంటుందని తమ సినిమాలకు అది చాలా బాగా హెల్ప్ అవుతుందని చెబుతోంది. మరి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లోనీ స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎంతో ఆలోచిస్తారు అలాంటిది ఈ తరహా సినిమాలను చేస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: