ఆచార్యతో పాటుగా లూసిఫర్ రీమేక్ కు సైన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరక్షన్ లో ఆ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో చిరు సర్ ప్రైజ్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. మళయాళ మూవీ లూసిఫర్ సినిమాలో సెకండ్ హీరో ఉండగా తెలుగులో ఆ పాత్రని కూడా ట్రిం చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మొత్తం భారం మొత్తం చిరు మీద వేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు టైటిల్ గా రెండు మూడు రకాల పేర్లు వినపడగా ఫైనల్ గా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఒక టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుతుంది. ఇంతకీ చిరు లూసిఫర్ రీమేక్ కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. సినిమా షూటింగ్ రోజే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆరోజే రిలీజ్ చేస్తారని అంటున్నారు.

చిరు గాడ్ ఫాదర్ సినిమాతో మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆచార్య తర్వాత మెగా ఫ్యాన్స్ కు కచ్చితంగా ఈ సినిమా స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా కూడా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాకు వీరయ్య టైటిల్ తో వస్తుందని టాక్. వీరయ్య సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో నటించబోతున్నాడని అంటున్నారు. బాబీ ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్ చేసుకునేలా అందిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మెహెర్ రమేష్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: