ఇండియా చలనచిత్ర పరిశ్రమలో
కరణ్ జోహార్ పేరు తెలియని వారు ఉండరు.
కరణ్ జోహార్ బాలీవుడ్ దర్శక
నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినీ పరిశ్రమలో స్టైల్ ఐకాన్ గా పేరుగాంచారు. ఎప్పటికప్పుడు తాజా ఫ్యాషన్స్ డ్రస్సులు వేసుకుంటూ
కరణ్ జోహార్ స్టైల్ గా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఈ మధ్యన కొత్త
ఆడి కార్ కొన్నారు.
ఆడి A8 L గ్యారేజీలో కొత్త
కార్ కొనడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఆడి కంపెనీ సెలూన్ లో ఇదే అత్యంత లగ్జరీ
కార్ అని చెప్పొచ్చు.
కరణ్ జోహార్ ఇది వరకూ జాగ్వార్ XJ L & మేబాచ్ S- క్లాస్
కార్ ను కొన్నారు.
ఆడి A8 L 2021 CNB లగ్జరీ
కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను కూడా గెలుచుకోవడం విశేషంగా చెప్పొచ్చు.
కరణ్ జోహార్ కార్ కొనడంపై
ఆడి ఇండియా ఇటీవల తన సోషల్
మీడియా హ్యాండిల్స్ లో తెలియజేసింది.
ఇదిలా ఉండగా దర్శక
నిర్మాత అయిన
కరణ్ జోహార్ బిగ్ బాస్ ఓటీటీని హోస్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. తన పిల్లలకు దూరంగా ఉండలేనని అన్నాడు. తన పిల్లలు రూహీ -
యష్ కి దూరంగా ఉంటూ హోస్టింగ్ చేయడం అతి పెద్ద ఫోమో అని అన్నారు.
బిగ్ బాస్ ఓటీటీ అనేది 6 వారాల రన్ కోసం
కరణ్ డ్రామా హోస్టింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 8వ తేది నుండి వోట్ లో
బిగ్ బాస్ ఓటీటీ అనేది ప్రసారం కానుంది.
కరణ్ జోహార్ లైగర్, దోస్తానా 2 వంటి సినిమాలను నిర్మిస్తున్నారు.
షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్,
సంజయ్ కపూర్ కూతురు సనయ, జాన్వీ చెల్లి
ఖుషీ కపూర్ లను
కరణ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డారు.