మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో కలిపి మొత్తం నాలుగు సినిమాలతో బిజీ గా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లుసిఫర్ రీమేక్ సినిమా చేస్తున్నాడు. అదే సమయంలో మెహర్ రమేష్ దర్శకత్వంలోనీ వేదలం సినిమా రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇక బాబీ దర్శకత్వంలోని క్రేజీ సినిమా ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది కి కానీ షూటింగ్ కి వెళ్ళదట.

ఇలా నాలుగు సినిమాలతో ఒకేసారి కాపురం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన పూర్వకాలం ని గుర్తు చేస్తున్నాడు. గతంలో ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటించే చిరంజీవి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తుండడం తో ఒక్కసారి గా మెగా అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి మరో రెండు సినిమాల ను కూడా లైన్లో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన కథలు వింటున్నాడట. ఇప్పటికే పూరి జగన్నాథ్ తో కొన్ని చర్చలు జరిపారు చిరు.  అలాగే చిన్న సినిమాల దర్శకుడు మారుతి కూడా చిరంజీవి కి ఓ కథను చెప్పారట. మరోవైపు సంపత్ నంది కథ ను కూడా చిరంజీవి విని ఓకే చేశారు అంటున్నారు. ఇలా ముగ్గురు దర్శకులతో సినిమాలు చేయాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాల్సీట్లు 2022 వరకు ఖాళీగా లేవు. మరి 2023లో వీరిలో ఏ దర్శకుల సినిమా లు ఫైనల్ అవుతాయో చూడాలి. వరుసగా రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో ఒరిజినల్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: