
ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాను పూర్తి చేసి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఈ సినిమా కూడా అదే దారిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. భవిష్యత్తులో కూడా మంచి మంచి విజయాలను అందుకోవడానికి వరుస హిట్స్ తో ఉన్న దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం గీత గోవిందం సినిమా తో హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద వుండగానే త్రివిక్రమ్ తో సినిమానీ ప్రకటించాడు మహేష్. త్రివిక్రమ్ కూడా స్టార్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా మొదలు కాకముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఇప్పుడు బయటికి రావడం అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ సినిమాను హాసిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఫుల్ కమర్షియల్ మాస్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు రాగా తక్కువ డ్యురేశన్ మాత్రమే కనిపించే త్రిష సినిమా మొత్తాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఈ విషయం బయటకు రాగానే వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా అందరికీ గుర్తుకు వస్తుంది. అలా ఈ సినిమా అతడు సీక్వెల్ అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి అతడే పార్ధు అనే టైటిల్ ను అనుకుంటున్నారని ఫిలిం నగర్ ఏరియా లో చర్చ జరుగుతుంది.