
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా అంధాధున్ సినిమా నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ట్రో అనే పేరుతో ఇక్కడ తెరకెక్కుతుండగా తమిళ భాషలో సైతం ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. హిందీలో టబు నటించిన బోల్డ్ అండ్ నెగెటివ్ పాత్రలో తమన్నా కనిపించనుంది.
వరస సినిమా లతో సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆయన హీరోగా నటించిన భీష్మ సినిమా తర్వాత వచ్చిన చెక్ మరియు రంగ్ దే సినిమాలు ప్రేక్షకులను భారీగా నిరాశపరిచాయి. దాంతో ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం తో కనిపిస్తున్నాడు. ఇందులో అంధుడిగా కనిపిస్తుండటంతో ఈ పాత్ర తో పాటు నటుడి గా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకు వస్తుందని ఆశిస్తున్నాడు నితిన్. ఇకపోతే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న తమన్నాకు ఈ సినిమా ఎంతో కీలకం కానుంది. ఓవైపు వెబ్ సిరీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్న ఈమె వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలలో నటించడం మొదలుపెట్టింది.
నిజానికి మ్యాస్ట్రో చిత్రంలో తమన్నా నటిస్తుందని అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ ఆమె రోల్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. కానీ ప్రచార చిత్రాల ద్వారా తమన్నా హీరోయిన్ పాత్ర కాదని మాతృక లో టబు నటించిన పాత్రలో ఆమె నటిస్తుందని తెలుస్తోంది. అక్కడ టబు నటనకు బాక్స్ బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు మరి ఇక్కడ తమన్నా ఏ రేంజ్ లో ఈ నెగిటివ్ పాత్రలో నటిస్తుందో చూడాలి. తాజాగా వెన్నెల్లో ఆడపిల్ల అని పాట ఈ చిత్రం నుంచి విడుదల కాగా మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో హీరో హీరోయిన్ తో పాటు తమన్నాను కూడా చివర్లో సింపుల్ గా చూపించారు. తమన్నా ను అంత సింపుల్ గా చూపించడంతో ఆమె పాత్ర పెద్దగా ఉండదా అనే కామెంట్లు వినబడుతున్నాయి సోషల్ మీడియా లో..