ఏ హీరో అయినా తన కెరీర్ లో తెలిసో తెలియకో కొన్ని సినిమాలను చేసి ఫ్లాప్ కొడతాడు. ఆ సినిమా ఆడదని ముందే తెలిసిన ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ చేశాక ఆడదు అని అర్థమవుతుంది. కానీ విడుదల చేయక తప్పదు. ఆ విధంగా మహేష్ బాబు కెరీర్ లో ఓ రెండు సినిమాలు ఆయనకు భారీ ఫ్లాప్ ను తెచ్చి పెట్టడమే కాకుండా చెడ్డ పేరు కూడా తీసుకు వచ్చింది. ఆ సినిమా లే మురుగ దాస్ దర్శకత్వం లో తెరకెక్కిన స్పైడర్, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు.
శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా చేసి తప్పు చేశాననే బాధలో ఉండగానే తమిళ దర్శకుడు మురుగదాస్ తో స్పైడర్ సినిమా చేసి మరో తప్పు చేశాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాడులో కూడా ఏమాత్రం ఆడలేదు. కాకపోతే ఈ సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో లో పనిచేస్తున్న కథానాయకుడు అనుకోకుండా ఓ సైకో కిల్లర్ పట్టుకోవాల్సి వస్తుంది. ఆ సైకో కిల్లర్ పెరిగిన వాతావరణం బట్టి కొంతమంది ను క్రూరం గా చంపుతూ ఉంటాడు. అలాంటి సైకో కిల్లర్ ను ఏవిధంగా కథానాయకుడు పట్టుకున్నాడు అనేదే ఈ సినిమా. 

మంచి లైన్ అయినా ఈ సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఇక దూకుడు వంటి సూపర్ హిట్ సినిమా చేసిన శ్రీను వైట్ల తో మరో సినిమా అనగానే మహేష్ అభిమానులు ఎగరి గంతేశారు. దూకుడు కున్మించి మహేష్ బాబు కాంబినేషన్ లో మరో లెవెల్ లో శ్రీనువైట్ల సినిమా చేస్తారని అనుకున్నారు. కానీ ఆగడు సినిమా వచ్చిన తర్వాత పరిస్థితి అర్థమైంది. మహేష్ బాబు కెరీర్లో మరో దారుణమైన ద్వారా వచ్చింది. ఇలా అప్పటికే కొన్ని డిజాస్టర్ లతో కుమిలిపోతున్న మహేష్ బాబు అభిమానులకు ఈ రెండు సినిమాలు కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలి తీరని వేదనను మిగిల్చాయి. రెవెన్యూ పరంగా కూడా ఈ సినిమాలు భారీ నష్టాలనే మిగిల్చింది సదరు నిర్మాతలకు. స్టార్ డైరెక్టర్ లు కావడంతో అన్ని హంగులతో భారీ బడ్జెట్ పెట్టగా ఈ సినిమాకు ఖర్చు కూడా బాగానే అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి