టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రతి ఐదేళ్లకోసారి హీరోయిన్ ల నెంబర్ వన్ పొజిషన్ మారుతూ ఉంటుంది. కొత్తవారు రావడం, పాత వారు ప్రేక్షకులకు మొహమెత్తి పోవడం వంటివి ఈ విధమైన పరిస్థితికి ముఖ్య కారణం. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లు గా ఉన్నారు పూజా హెగ్డే మరియు రష్మిక మందన. వీరు కొంతకాలం టాప్ హీరోయిన్ గా కొనసాగి ఆ తర్వాత వీరి స్థానంలో కొత్త హీరోయిన్లు రావడం సహజం. గతంలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క కాజల్ సమంత రకుల్ ప్రీత్ సింగ్ వంటివారికి ఇప్పుడు సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో భవిష్యత్ స్టార్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు చాలా హిందీ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి సినిమా సక్సెస్ కాకపోయినా ఆమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గ్లామర్ పాత్రలకు కూడా సై అనడంతో టాలీవుడ్ లో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఆమె పాత్ర కు బాగా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. అంతే కాదు ఆ సినిమాలో ఆమె అందాలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో ఆమెకు మెల్ల మెల్లగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన నటించే సినిమాలో అవకాశం కొట్టేసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ కూడా విడుదల అయింది. అంతే కాకుండా మరికొంతమంది స్టార్ హీరోల సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి అంటున్నారు. చూడబోతే భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ ఈమె అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: