
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే ఎక్కువ టాలెంట్ తో పాటు కొంతైనా అదృష్టం ఉండాలి. ఆ విధంగా మంచి టాలెంట్ అందం అభినయం కలిగిన హీరోయిన్ మేఘ ఆకాష్. తెలుగు సినిమాల ద్వారా సినిమాలలోకి పరిచయమైన ఈమె ఇప్పటికీ హీరోయిన్ గా సెటిల్ కాకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. తమిళంలో సైతం ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా మోస్తరు హీరోయిన్ గా కూడా ఆమె ఎదగలేక పోయింది. హిందీలో సైతం సినిమా చేసి అక్కడ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. అలా తెలుగు తమిళ హిందీ భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది ఈమె.
ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ రాజ చోర సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించగా ఆమె పాత్రకు మంచి స్పందన వస్తుంది. సినిమా కూడా మంచి హిట్ కావడంతో మేఘ ఆకాష్ కు అదృష్టం వరించినట్లు అయ్యిందని చెబుతున్నారు. ఇంకా తెలుగులో ఆమె మనుచరిత్ర , గుర్తుందా శీతాకాలం, అలాగే అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా ఇదే సమయంలో తమిళ్ లో కూడా కొన్ని సినిమాలను చేస్తూ అక్కడ కూడా బిజీగా ఉంది. చూడబోతే ఈమె త్వరలోనే టాప్ హీరోయిన్ కావడం ఖాయం అనిపిస్తుంది.
ఎంతటి టాలెంట్ ఉన్న వారికైనా సక్సెస్ తోడు కావాలి లేదంటే సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ అమ్మాయి కూడా తెలుగులో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ తమిళ సినిమాలలో తన కెరీర్ ను నెట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు శ్రీ విష్ణు రాజ రాజ చోర సినిమా ద్వారా హిట్ వచ్చింది. దాంతో ఆమె టాలీవుడ్ పెద్ద హీరోల కళ్ళల్లో పడినట్లు అయ్యింది. మరి ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయో చూడాలి. నితిన్ హీరోగా నటించిన లై అలాగే చల్ మోహనరంగ సినిమాలలో తప్ప ఆమె తెలుగులో పెద్దగా పేరున్న చిత్రాలు చేయలేదు.