కరోనా సెకండ్ వేవ్ వలన మన తెలుగు సినిమాల పరిస్థితి ఎటూ అర్థం కాని రీతిలో తయారైంది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలకు ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది.ఇక పెద్ద సినిమాల టార్గెట్ ఎప్పుడూ పండగ సీజన్ల పైనే ఉంటుంది. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతి బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకునేందుకు ఇప్పటినుంచే కర్చీఫ్ లు వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే సంక్రాంతి పండుగకు పవన్ కళ్యాణ్  భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారు పాట, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నట్లు ఆయా చిత్రాల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఇక మరోసారి దర్శకుడు కొరటాల శివ తాను తెరకెక్కిస్తున్న..

 ఆచార్య సినిమాను కూడా సంక్రాంతి కే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే సంక్రాంతి నాటికి దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత అనేది తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని కొరటాల శివ భావిస్తున్నాడట.ఈ క్రమంలో కొరటాల శివ తాజాగా భీమ్లా నాయక్ నిర్మాతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేది లేదని చెప్పేసారట.మరి ఇందులో నిజ నిజాలేంటో తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండ్రస్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.మరి ఆచార్య కూడా సంక్రాంతికి విడుదల అవుతుందా లేక మరో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంటుందా చూడాలి.

ఇక త్వరలోనే ఆచార్య రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.అటు  భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.ఇక మెగాస్టార్ సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక రామ్ చరణ్ కి జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది.అటు మరోవైపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పై కూడా అదే తరహాలో అంచనాలు ఉండగా సంక్రాంతికి మెగా హీరోల మధ్య పోటీ ఉంటుందా?ఉండదా?అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: