సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా మంచి నటన కనబరిచితే.. ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కి అందం, అభినయం, నటన ఉన్నప్పటికీ , స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ మహేశ్వరి. ఆమె గురించి కొన్ని విషయాలను చూద్దాం..
మొదటిసారిగా"అమ్మాయి కాపురం"అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఇక ఈ సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈమె. ఇక ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన"గులాబీ" సినిమా ఈమెకు బాగా కలిసొచ్చింది. ఇక ఆ తర్వాత దెయ్యం, పెళ్లి, నీకోసం వంటి కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది మహేశ్వరి. పెళ్లి సినిమాలో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పవచ్చు.
ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా, స్టార్ హీరో అజిత్ తో కూడా"ఉల్లాసం"అనే చిత్రంలో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే.. సాప్ట్ వేర్ అబ్బాయిని వివాహం చేసుకుంది. దాంతో ఈమె సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేయలేదు. ఆ తరువాత..2008 లో"మై నేమ్ ఈస్ మంగతాయారు"అనే ఒక సీరియల్ తో మరి తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది ఆమెకు కలిసి రాలేదు.
ఇక అలనాటి తార శ్రీదేవికి దగ్గర బంధువు అన్న సంగతి బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. మహేశ్వరి ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి కజిన్ అయిన సూర్యకళ కుమార్తె ఈ మహేశ్వరి. ఈమె సినీ ఇండస్ట్రీ లోకి వచ్చేటప్పుడు శ్రీదేవి సపోర్ట్ చేయనా..? అని చెప్పినా కూడా అందుకు ఒప్పుకోలేదట. స్వయంకృషితోనే నాకు పైకి రావాలని వుంది అని, అదే నా చిరకాల కోరిక అని చెప్పిందట. కానీ దర్శక నిర్మాతలు అలాగే కుటుంబ సభ్యులు సలహా మేరకు మాత్రమే, మహేశ్వరి నటించిన సినిమా వేడుకలకు శ్రీదేవిని ఆహ్వానించేవారు.
కానీ కేవలం ఒక్క సమయంలోనే అనగా మహేశ్వరి సినిమాలలో ,అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో సీరియల్ లోకి రీఎంట్రీ ఇచ్చింది . అప్పుడు శ్రీదేవి కొంచెం సహాయం చేసిందని మహేశ్వరి చెప్పుకొచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో మంచిగా తనకు నచ్చిన పాత్ర వచ్చినట్లయితే తప్పకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని కూడా ఆమె చెప్పింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి