రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్ ఆల్బమ్స్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ సింగర్ ఆ తర్వాత కాలంలో కొన్ని సినిమాలలో కూడా పాటలు పాడాడు. ఈ పాటలు కూడా మంచి విజయం సాధించడంతో తెలుగునాట ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ప్రముఖ రియాల్టీ షో అయిన 'బిగ్ బాస్' లో ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఆ తర్వాత కూడా ఈ సింగర్ తన చేష్టలతో తన బిహేవియర్ తో ఎంతోమంది మనసులను గెలుచుకొని 'బిగ్ బాస్' తెలుగు సీజన్ త్రీ లో ఫైనల్ విన్నర్ గా గెలిచాడు. ఇదిలా ఉంటే రాహుల్ 'బిగ్ బాస్' నుండి బయటకు వచ్చిన తర్వాత 'ఓ బేబీ' అనే ఆల్బమ్ పాటను తీశాడు. ఈ పాట కోసం రాహుల్ చాలా ఖర్చు పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టాడు అంటే 'ఓ బేబీ' అనే పాట తీసిన ఖర్చుతో ఒక సినిమాని పూర్తి చేయవచ్చు అని రాహుల్ ఒక సందర్భంలో తెలియజేశాడు. అంత ఖర్చు పెట్టి తీసిన ఈ పాట అంతగా క్లిక్ అవ్వలేదు. ఇదే పాటను హిందీలో విడుదల చేసిన కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. రాహుల్ సిప్లిగంజ్ తాజాగా 'నువ్వెవరో' అనే  ఆల్బమ్ చేసాడు. ఇందులో రాహుల్ కు జోడీగా అషూ రెడ్డి ని తీసుకున్నాడు. ఇక రాహుల్, అషూ రెడ్డి కి మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే, వీరిద్దరి గురించి ఎన్ని రూమర్స్ వచ్చాయో కూడా మన అందరికీ తెలిసిందే. సాయంత్రం అయితే చాలు పార్టీ చేసుకోవాల్సిందే, మేమిద్దరం క్లోజ్ అయ్యింది కూడా అక్కడే అని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది. ఇలా వీరిద్దరి వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే వీరిద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే తాజాగా 'నువ్వెవరో' ఆల్బమ్ కోసం అషూ రెడ్డి చేసిన సాయం మరియు నిజమైన స్నేహం గురించి రాహుల్ చెప్పుకొచ్చాడు. మాది నిజమైన స్నేహం అని గుర్తించిన మొదటి వ్యక్తివి నువ్వే అంటూ ఒక నెటిజన్ కు రిప్లై ఇస్తూ రాహుల్, అషూ గురించి చెప్పుకొచ్చాడు.

అషూ ఈ ఆల్బమ్ తీసేందుకు నాతో మూడు రోజుల పాటు పని చేసింది, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒక ఫ్రెండ్ లా నన్ను అంతలా సపోర్ట్ చేసింది. అదే నిజమైన ఫ్రెండ్ షిప్ అంటూ అషూ గురించి రాహుల్ స్పందించాడు. దానిపై స్పందించిన అషూ ఐ లవ్ యు రాహుల్ అని చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: