సంపత్ నంది దర్శకత్వంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ నటించిన తాజా చిత్రం 'సీటీమార్'.స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది.ఇక సెప్టెంబర్ 10 న వినాయక చవితి సంధర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్న రెండు నెలల తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే అని చెప్పాలి.నిజానికి మొదట ఈ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తారంటూ మొన్నటివరకు ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకొని తాజాగా థియేటర్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

ఇక సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు చిత్ర యూనిట్.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో గోపిచంద్.. ఓటీటీ, థియేటర్ వ్యవస్థ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో గోపిచంద్ మాట్లాడుతూ..'ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది.అందరూ థియేటర్ కోసమే సినిమా చేస్తారు.ఇక ఓటీటీల్లో విడుదల చేసుకోవడంలో కూడా ఎలాంటి తప్పులేదు.ఇప్పుడు థియేటర్లో విడుదల చేసే అవకాశం ఉంది కదా? ఆడియన్స్ కూడా మెల్లమెల్లగా థియేటర్లకు వస్తున్నారు.థియేటర్లు తెరుచుకున్నప్పటికకీ కొంతమంది ఓటిటిని ఆశ్రయిస్తున్నారు.

నేను ఒక్కడినే ఈ విషయంలో కామెంట్ చేయడం సరికాదు.వాళ్ళ స్థానంలో కూడా కూర్చొని ఆలోచించాలి.వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా?..ఎవరైనా సరే..ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేద్దామని అనుకుంటారు.మనం నిద్రపోతున్నా..వడ్డీలు నిద్రపోవు.పెరుగుతూనే ఉంటాయి.ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే కిక్.ఓ సీన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో థియేటర్ లోనే తెలుస్తుంది.ఓటీటీ అనేది కూడా మంచి ప్లాట్ ఫామే.కాకపోతే థియేటర్లు పోవడం జరగదు.అవి లైఫ్ లాంగ్ ఉంటాయి.ఓటీటీ అనేది మరో వేదిక అంతే.దాని వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి.ఇక ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సి తో థియేటర్లు రన్ అవుతున్నాయి.కరెక్ట్.. కానీ ఓ సినిమాని ఎన్ని రోజులని అపుకొని కూర్చుంటాం? బయటికి వెళ్ళాలి కదా' అంటూ చెప్పుకొచ్చాడు గోపిచంద్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: