ఇప్పుడు ఎక్కువగా రెండు రాష్ట్రాలలో సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా అన్ని టీవీ ఛానల్స్ లో 24 గంటలు గా మెగా మేనల్లుడు వార్త గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో కొన్ని ఛానల్స్ మాత్రం సాయి ధరంతేజ్ గురించి తప్పుగా రాస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు ఆ ఛానల్స్ పై మండి పడుతున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేసుకుంటున్నారు అన్నట్టుగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

కొన్ని చానల్స్ లో సాయి ధరమ్ తేజ్ ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ఆక్సిడెంట్ జరిగింది అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక ఈ నిజాన్ని కూడా ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు.. ఇక అంతే కాకుండా సీసీ టీవీ చూసిన తర్వాత అసలు నిజం బయటికి వచ్చింది. మన హైదరాబాదు లో అంత స్పీడ్ గా వెళ్ళే రోడ్లు ఎక్కడా లేవు అన్నట్లుగా తెలియజేశారు.. కేవలం 75  కిలోమీటర్లు స్పీడ్ తోనే సాయి ధరంతేజ్ బైక్ నడిపాడు అన్నట్లుగా తెలుస్తోంది.
కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు.. అందుకనే పడ్డారా అన్నట్లుగా ప్రసారం చేయడం వల్ల, కొంత మంది సినీ ప్రముఖులు వారి మీద ఫైర్ అయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.ఆయనకు మెగా ఫ్యామిలీ పై ఉన్న అభిమానం ఎంతో మనకు తెలిసిందే. ఎంతో మంచి వ్యక్తి సాయి ధరంతేజ్.. అలాంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ లో ఉంటే తట్టుకోలేకపోతున్నా అన్నట్లుగా తెలియజేశాడు.
మీలాంటి మంచి వారికి ఏమీ కాదు.. మిమ్మల్ని చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు అన్నట్లుగా తెలియజేశాడు హైపర్ ఆది. ఇక సాయి ధరంతేజ్ 300-400 స్పీడ్ తో బైక్ ను నడిపాడు అన్నట్లుగా వార్తలు రావడంతో.. ఆది హైదరాబాద్ రోడ్లపై.. సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్ కూడా అంత స్పీడ్ తో ఈ రోడ్లపై వెళ్ళలేడు అన్నట్లుగా తెలియజేశాడు.. అంతేకాకుండా అలా చూపించిన వారిని.. మీరు ఎక్కడ దొరికేరా బాబు మాకు.. అన్నట్లుగా ట్వీట్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: