వెన్నెల సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ . ఈ సినిమా అంతా గొప్ప విజయం సాదించకపోయిన కూడా ఆయన చేసిన కామెడీ కి చాలా పెరు వచ్చింది. సినిమా అంతా తెలంగాణ భాషలో కిషోర్ చేసే కామెడీ అంత ఇంత కాదు. సాఫ్ట్ వెర్ గా ఉండే వెన్నెల కిషోర్ జీవితాన్ని ఈ సినిమా మొత్తం మార్చేసింది. వెన్నెల తర్వాత కిషోర్ తెలుగు సినిమాల్లో సెటిల్ అయ్యాడు అనే చెప్పాలి. వరసగా మంచి మంచి కామెడీ పాత్రలు చేస్తే కిశోర్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాడు.

వెన్నెల కిషోర్ దగ్గర ఉన్న ఇంకొక టాలెంట్ ఏంటి అంటే డైరెక్షన్ కూడా చేయగలడం.ఆయన జఫ్ఫా , వెన్నెల వన్ అండ్ హాఫ్ సినిమాలకి దర్శకత్వం వహించారు. కానీ అవి ఏవి అంత పెద్దగా ఆడలేదు.దానితో ఈ డైరెక్షన్ ని పక్కకు పెట్టి కిషోర్ వరసగా సినిమాలని ఒప్పుకుంటు బిజీ బిజీగా ఉన్నారు. ఏ హీరో కాంబినేషన్ లో అయిన వెన్నెల కిషోర్ కామెడీ పండించగలడు. దూకుడు , అలా ఎలా లాంటి సినిమాల్లో ఆయన కామెడీ కి చాలామంచి పేరు వచ్చింది.ప్రస్తుతం తెలుగులో ఉన్న సూపర్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో వెన్నెల కిషోర్ ఒకరు.

చి ల సౌ లో వెన్నెల కిషోర్ కామెడీ సైమ అవార్డ్ వచ్చింది అలాగే భలే భలే మొగాడివోయ్ సినిమాలో నటనకి గాను నంది కూడా లభించడం విశేషం. వెన్నెల కిషోర్ కి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా లో కూడా ఫాన్స్ ఉన్నారు. ఆయన పెట్టె పోస్టులు అన్ని చాలా నవ్వు తెప్పిస్తాయి. ఇలా కూడా వెన్నెల కిషోర్ జనాలని ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం వెన్నెల కిషోర్ ఆచార్య సినిమాలో మరియు ఖిలాడి , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: