ఇకపోతే ఈమె తన భర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుంది.. మహారాష్ట్రలోని థానే లో నివసిస్తున్న మలైకా అరోరా ప్రస్తుత వయసు 46 సంవత్సరాలు. మోడల్, డాన్సర్, యాక్టర్, వీడియో జాకీ గా గుర్తింపు పొందిన మలైక అరోరా బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్.. ఆయన తమ్ముడు దర్శకుడు, నిర్మాత , నటుడు అయిన అర్భాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1998వ సంవత్సరంలో వీరికి వివాహం జరిగింది. 2002వ సంవత్సరంలో వీరికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన బోనీకపూర్ తనయుడు హీరో అర్జున్ కపూర్ , వీరికి అత్యంత కుటుంబ సన్నిహితుడు. ఈమె అర్జున్ కపూర్ తో రోజురోజుకు సన్నిహితంగా ఉంటూ వస్తూ, తన భర్త అర్బాజ్ ఖాన్ కు దూరం అవుతూ వచ్చింది. కొన్ని రోజులపాటు చాటుమాటుగా తిరిగి, చివరికి ఒకరోజు వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలోనే 2017వ సంవత్సరంలో 19 సంవత్సరాలు తన వైవాహిక జీవితానికి మలైకా అరోరా స్వస్తి పలికింది. ఇక ఆ తర్వాత తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లో వుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి